: పెళ్లి వాయిదా వేస్తోందని ప్రియురాలిపై యాసిడ్ పోశాడు
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఓ యువకుడు తన ప్రియురాలిపై యాసిడ్ దాడి చేశాడు. ఆమె పెళ్లి వాయిదా వేస్తుండడమే ప్రియుడి ఆగ్రహానికి కారణమైంది. మల్లాపూర్ గ్రామానికి చెందిన హంస అనే అమ్మాయికి కడెం గ్రామానికి చెందిన మునీర్ 2009లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. మునీర్ హైదరాబాదులో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం నిర్మల్ చేరుకున్న ఈ యువకుడు హంసను బస్టాండ్ వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్యుద్ధం నడిచింది. పథకం ప్రకారమే అక్కడికి వచ్చిన మునీర్ తన బ్యాగులోంచి యాసిడ్ సీసా తీసి హంసపై పోశాడు. అనంతరం, అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన హంసను ఆసుపత్రికి తరలించారు.