: పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ అదృశ్యం కేసు వీడింది


పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. టోనీ బెర్రియర్ అనే మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అపార్ట్ మెంట్ వాచ్ మన్ భగవత్ ఆమెను హత్య చేసినట్టు తేల్చారు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కొత్తచెరువు మండలం తల్లమర్లలో శవాన్ని పూడ్చినట్టు నిందితులు తెలిపారు.

  • Loading...

More Telugu News