: రాజకీయాలు కావాలనుకుంటే ఎప్పుడో ఎంపీనయ్యేవాడిని: కమలహాసన్


విలక్షణ నటుడు కమలహాసన్ నేడు 60వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ, రాజకీయాలు కావాలనుకుంటే తాను ఎప్పుడో ఎమ్మెల్యే, ఎంపీని అయి ఉండేవాడినని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆయన పైవిధంగా పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం ఇష్టమేనని, అయితే, రాజకీయాల ద్వారా సేవ చేయబోనని, సినిమాల ద్వారా సేవ చేస్తానని వివరించారు.

  • Loading...

More Telugu News