: ప్రభుత్వ కార్యాలయాల వద్ద జయలలిత ఫోటోలు... వివరణ కోరిన మద్రాస్ హైకోర్టు


తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, సంక్షేమ పథకాల ప్రచారంలోనూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలు ఉండటంపై హైకోర్టు మధురై బెంచ్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. ఈ మేరకు జయ ఫోటోలు తీసివేయాలంటూ మధురై బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్.కరుణానిధి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దాని ఆధారంగా జస్టిస్ వి.ధనపాలన్, వీఎం.వేలుమణిల ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని పైవిధంగా ఆదేశించింది. "నిబంధనల ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు తదితర చోట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటోలనే పెట్టాలి. కానీ, వారు అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన మాజీ సీఎం జయలలిత ఫోటోలను పెట్టారు" అని పిటిషనర్ పిల్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News