: బలహీనపడిన తీవ్రవాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒంగోలుకు తూర్పు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయ దిశగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 48 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. అటు, ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వాయుగుండం వల్ల శనివారం నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.