: ఏపీలో నాలుగు యూనివర్శిటీలకు కొత్త వీసీలు
ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు విశ్వవిద్యాలయాలకు కొత్త ఇన్ ఛార్జి వీసీలను ప్రభుత్వం నియమించింది. రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా విజయప్రకాశ్, విక్రమసింహపురి వర్శిటీకి వియన్నారావు, కాకినాడ జేఎన్టీయూకి ప్రభాకర్ రావు, ఎస్కేయూ వీసీగా లాల్ కిషోర్ నియమితులయ్యారు. ఈ నెల 9న ఈ యూనివర్శిటీల ఉపకులపతులు పదవీ విరమణ చేస్తుండడంతో ఇన్ ఛార్జిలను నియమించారు.