: టీడీపీ నేతలు మలినం చేశారంటూ... పాలతో కడిగిన న్యాయవాదులు
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ ను, అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ న్యాయవాదులు పాలతో శుద్ధి చేశారు. టీడీపీ నేతలు ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్నంతా మలినం చేశారని విమర్శించారు. త్వరలోనే టీటీడీపీ నేతలకు ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. మరోసారి గన్ పార్కులోకి టీటీడీపీ నేతలు అడుగుపెడితే సహించమని హెచ్చరించారు.