: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి కేబినెట్ విస్తరణ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం పది మందికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై అధికారికంగా రేపు ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది.