: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, ఈ రోజు హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. మార్కెట్ యార్డు కమిటీలను రద్దు చేస్తూ టీఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. తీర్పును సవాల్ చేసేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. అంతవరకు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని స్పష్టం చేసింది.