: ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఒకరికే పింఛను: కేటీఆర్


తెలంగాణలో రేపటి నుంచి 'ఆసరా' పథకం ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనుక ఒకరికి మాత్రమే పింఛను వస్తుందని తెలిపారు. ఇంట్లో వృద్ధుడు, వితంతువు, వికలాంగుడు ఉంటే ముగ్గురికీ పింఛను అందుతుందని చెప్పారు. స్కెలెటిన్ ఫ్లోరోసిస్ (ఫ్లోరోసిస్ లో ఒక రకం) ఉన్నవారికి కూడా వికలాంగుల పెన్షన్ వర్తిస్తుందని తెలిపారు. ఆధార్ కార్డు లేనివారికి కూడా పింఛను ఇస్తామని... అయితే మూడు నెలల్లోగా వారు ఆధార్ కార్డులను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే, ధృవప్రతాలు లేని మహిళలు, వితంతువులను కూడా అధికారులు ఇబ్బంది పెట్టరాదని సూచించారు. మొదటి నెల పింఛనును నగదు రూపంలో అందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News