: వీడు సామాన్యుడు కాదు!


పాల్ రోసోలీ... ఓ అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు, వైల్డ్ లైఫ్ ఫిలిం మేకర్, అన్నింటికి మించి ఓ సాహసి. తాజాగా, డిస్కవరీ చానల్లో ప్రసారమయ్యే ఓ టీవీ షో కోసం రోసోలీ ఏం చేశాడో తెలిస్తే మీకు ఒళ్ళు జలదరిస్తుంది. ఇంతకీ తనేం చేశాడంటే, ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం అనకొండ పొట్టలోకి వెళ్లాడు! 'ఈటెన్ ఎలైవ్' పేరిట రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. 'అయాం పాల్ రోసోలీ' అంటూ... ఈ సాహసకార్యం గురించి రోసోలీ మాటల్లో సాగే 30 సెకన్ల టీజర్ ను ట్విట్టర్లో ఉంచారు. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన మరో టీజర్ లో స్నేక్ ప్రూఫ్ సూట్ ధరించి అనకొండ పాము వద్ద ఉన్న రోసోలీ దర్శనమిస్తాడు. దీనిపై డిస్కవరీ చానల్ ప్రతినిధి ఏఎఫ్ పీ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ప్రస్తుతానికి టీజర్ విడుదల చేశామని తెలిపారు. డిసెంబర్ 7న పూర్తి కార్యక్రమం ప్రసారమవుతుందని తెలిపాడు. కాగా, భయంకర సర్పం నోటి ద్వారా ఉదరంలోకి వెళ్లిన రోసోలీ తిరిగి ఎలా బయటికి వచ్చాడన్న దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, జంతువుల హక్కులపై పోరాడే 'పెటా' దీనిపై గళమెత్తింది. ఆ పాము పరిస్థితిపై తమకు ఆందోళనగా ఉందని, ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని డిస్కవరీ చానల్ ను డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News