: అప్పుడు నాపై నాకే సందేహం వచ్చింది: 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' నుంచి మరికొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. అరంగేట్రం టెస్టులో వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ఉద్ధండులను ఎదుర్కొనాల్సి వచ్చిందని, ఆ సమయంలో తన సామర్థ్యంపై తనకే సందేహం వచ్చిందని సచిన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అక్రమ్, యూనిస్ కు తోడు ఆకిబ్ జావేద్ కూడా నిప్పులు చెరిగిన ఆ నాటి మ్యాచ్ ఓ భయానక అనుభవమన్నాడు. ఆ మ్యాచ్ తో, అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో తాను రాణించగలనా? అన్న సందేహం తలెత్తిందని వివరించాడు. ఇమ్రాన్ ఖాన్, అక్రమ్, యూనిస్, జావేద్ వంటి నాణ్యమైన సీమర్లతో కూడిన పాకిస్థాన్ ను ఎదుర్కొనాల్సి రావడం తొలి మ్యాచ్ ఆడుతున్న ఏ క్రికెటర్ కైనా నిజంగా పరీక్షేనని తెలిపాడు.