: నల్లధనంపై మోదీ వైఖరి భేష్: పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం దశదిశలా వ్యాపిస్తోంది. అగ్రరాజ్యాధినేతలనే కాక శత్రు దేశ రాజకీయవేత్తలను కూడా మోదీ మైమరపిస్తున్నారు. మోదీ పలు అంశాలపై వ్యవహరిస్తున్న తీరు దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగానూ భారీ చర్చకు దారితీస్తోంది. తాజాగా మోదీ పనితీరును శత్రుదేశం పాకిస్థాన్ కు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కీర్తించారు. విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని తిరిగి దేశానికి తెచ్చేందుకు మోదీ చేస్తున్న కృషి అమోఘమని ఖాన్ వ్యాఖ్యానించారు. "మోదీ గురించి మీరేమన్నా అనుకోండి, ఆయన మాత్రం విశ్వసనీయత కలిగిన వ్యక్తే" అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పాక్ ప్రభుత్వం కూడా మోదీ తరహాలో నల్లధనంపై యుద్ధం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.