: రేపు గోవా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: మనోహర్ పారికర్
మోదీ కేబినెట్ లో బెర్తు ఖరారైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు స్వయంగా పారికర్ శుక్రవారం తన రాజీనామాను ప్రకటించారు. శనివారం తాను గోవా సీఎం పదవికి రాజీనామా చేయనున్నానని, అదే రోజు తన స్థానంలో మరో వ్యక్తి గోవా సీఎం బాద్యతలు స్వీకరిస్తారని ఆయన ప్రకటించారు. అయితే తన తర్వాత గోవా సీఎం పీఠం ఎక్కనున్న వ్యక్తి పేరును మాత్రం మనోహర్ పారికర్ వెల్లడించలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిశ్చయించుకున్న ప్రధాని మోదీ, పారికర్ ను కేబినేట్ లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీ పర్యవేక్షిస్తున్నారు. అరుణ్ జైట్లీకి ఉపశమనం కల్పిస్తూ, రక్షణ శాఖ బాధ్యతలను మనోహర్ కు అప్పగించేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.