: కేబినెట్ బెర్తులతో శాంతించిన శివసేన
ఆదివారం చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో శివసేన పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న సేన కేంద్రంలో ఇచ్చిన అవకాశంతో శాంతించింది. ఈ విషయాలను శివసేన సీనియర్ నేత ఒకరు ధృవీకరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేబినెట్ విస్తరణలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను తీసుకోబోతున్నట్టు తెలిపారు. కొన్ని నెలల కిందటే బీజేపీ ఆ భరోసా ఇచ్చిందని, ఇప్పుడు చర్చించుకుని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. "దానిపై సమగ్రంగా చర్చించి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. అది కేబినెట్ పదవా, మహారాష్ట్రలో మంత్రి పదవా లేక స్వతంత్ర బాధ్యతలా అనే దానిపై ఆధారపడి ఉంది" అని సేన పార్టీ నేత వివరించారు.