: శాసనసభ నుంచి 10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్


సభా కార్యక్రమాలు కొనసాగకుండా, అడ్డుతగులుతున్న టీడీపీ నేతలను సస్పెండ్ చేయాలని టీఎస్ మంత్రి హరీష్ రావు సభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. వెంటనే స్పీకర్ మధుసూదనాచారి హరీష్ రావు ప్రతిపాదించిన వారందరినీ సభనుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఆరికెపూడి గాంధి, ఎం.గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎం.కృష్ణారావు, టి. ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, వెంకటవీరయ్య, జి.సాయన్న ఉన్నారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని స్పీకర్ కోరారు.

  • Loading...

More Telugu News