: మీకిదే చివరి ఛాన్స్!: శివసేనకు మోదీ హెచ్చరిక
‘కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులిస్తాం. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటేయండి. ఆ తర్వాత ఫడ్నవీస్ సర్కారులోనూ కొన్ని పదవులిస్తాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్రలో తన చిరకాల మిత్రపక్షం శివసేనకు తేల్చి చెప్పారు. అలా కాకుండా గతంలో మాదిరిగా మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవితో పాటు, మూడింట ఒక వంతు మంత్రి పదవులు కావాలంటూ డిమాండ్ చేస్తే కనుక, ఇక మేము చేసేదేమీ లేదన్నట్లు మోదీ, ఉద్ధవ్ థాకరేకు చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ మాటల్లోని ఆంతర్యాన్ని థాకరే గ్రహించినట్లే ఉంది. అందుకే కేంద్ర కేబినెట్ లో రెండు బెర్తులతో పాటు ఫడ్నవీస్ కేబినెట్ లోనూ వారిచ్చిన పదవుల మేరకే సర్దుకోవాలని కూడా శివసేన వర్గాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.