: వారణాసిలో మోదీకి భారీ భద్రత!
తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని హోదాలో తొలి పర్యటన చేస్తున్న నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పిస్తోంది. ప్రధాని భద్రత కోసం 12 మంది ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరికి సహాయంగా 18 మంది ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 135 మంది ఎస్సైలు, వెయ్యి మంది దాకా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం మోదీ పర్యటన ముగిసే దాకా వీరు ప్రధాని భద్రత కోసం పనిచేస్తున్న ఎస్ పీజీ సభ్యుల సూచనల ప్రకారం చర్యలు చేపట్టనున్నారు.