: హోంశాఖ కార్యదర్శితో భేటీ అయిన ఇరు రాష్ట్రాల సీఎస్ లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ కేంద్ర హోంశాఖకు చేరింది. ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ కలగజేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అలాగే, ఉద్యోగుల విభజన ప్రక్రియను కూడా త్వరగా ముగించాలని కోరారు.