: భూటాన్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఉదయం భూటాన్ పర్యటనకు బయలుదేరివెళ్లారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్ గ్యేల్ వాంగ్చుక్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి ఆ దేశానికి వెళ్లారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. రాష్ట్రపతితో పాటు రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, నలుగురు బీజేపీ ఎంపీలు కూడా వెళ్లారు. గత 26 సంవత్సరాల్లో ఆ దేశ రాజధాని థింపును భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే ప్రథమం!

  • Loading...

More Telugu News