: ఇక ఇసుక కూడా ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే లభ్యం!
ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఒదిగిపోతోంది. సరికొత్త తరహా వ్యవస్థల ఆవిర్భావానికి శ్రీకారం చుడుతోంది. ఆన్ లైన్ లో దొరకని వస్తువంటూ లేదు. ఏ వస్తువైనా ఆన్ లైన్ ద్వారా ఇంటికే తెప్పించుకుంటున్నాం. తాజాగా ఇసుక కోసం కూడా మనం ఆన్ లైన్ బాట పట్టాల్సి వస్తోంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకే మనకు ఇసుక చేరుతుంది. అంతేకాదు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇసుక వాస్తవ ధర, రవాణా చార్జీలు అన్ని కూడా ఆన్ లైన్ లోనే లభ్యం కానున్నాయి. మనం బుక్ చేసుకున్న ఇసుక ఎప్పటిలోగా అందనుంది? ప్రస్తుతం ఎక్కడ వస్తోంది? అన్న వివరాలు ఎప్పటికప్పుడు మన సెల్ ఫోన్ కు మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. అంతేకాదండోయ్, ఆన్ లైన్ లో కాకుండా ఇతర మార్గాల్లో ఇసుక లభించదు. ఇసుక విక్రయాల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు తాజాగా ఏపీ సర్కారు ఈ చర్యలు చేపట్టింది.