: విశాఖ అడవులను కాల్చేస్తున్న అగ్నికీలలు


విశాఖపట్నం జిల్లా పరిధిలోని అడవులను అగ్నికీలలు దహించి వేస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం చిన్నగా మొదలైన మంటలు క్రమేణా అదుపు చేయడానికి వీలు కాని స్థితికి చేరాయి. ప్రస్తుతం విశాఖ అడవుల్లో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలు విశాఖ మన్యంలోని దాదాపు పది గ్రామాలను చుట్టుముట్టే ప్రమాదం నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంటలను ఆర్పేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు చేసిన యత్నాలు ఫలించని నేపథ్యంలో నేడు హెలికాఫ్టర్ల సాయంతో అగ్ని కీలలను అదుపు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా కొండపై ఉన్న శివాలయంలో భక్తులు పెట్టిన దీపాలే ఈ కార్చిచ్చుకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News