: పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహిళల రక్షణ కోసం త్వరలోనే 181 హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో మహిళల కేసుల విచారణ కోసం డీఎస్పీ స్థాయి కలిగిన మహిళను నియమిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తెచ్చేలా ప్రయత్నిస్తామని తెలిపారు. సిక్కులకు కూడా కళ్యాణలక్షి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.