: ధావన్ హాఫ్ సెంచరీ... భారత్ 91/1
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 21 ఓవర్లు ముగిసే సరికి ఒక్క వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 30 (42 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడుతున్నాడు.