: సోనియా ఇటలీ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు: హర్యానా మంత్రి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో ఇటలీ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే తన కంపెనీలను మూసివేస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. తప్పు చేసిన వాళ్లు తప్పక పట్టుబడతారని విజ్ పేర్కొన్నారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2012లో 6 కంపెనీలు స్థాపించిన వాద్రా, వాటిలో నాలుగింటిని మూసివేశారు. మిగిలిన 2 కంపెనీలు కూడా మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.