: టీఆర్ఎస్ లో చేరే నిర్ణయాన్ని విరమించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య కారు ఎక్కినట్టే ఎక్కి దిగిపోయారు. రెడ్యానాయక్ తో పాటే యాదయ్య కూడా టీఆర్ఎస్ లో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, చివరి నిమిషంలో ఏమైందో కానీ, టీఆర్ఎస్ లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. మరోవైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలను టీకాంగ్రెస్ పెద్దలు శుభసూచకంగా భావిస్తున్నారట.