: రసాభాసగా మారిన కాంగ్రెస్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
విశాఖలో తుపాను బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కేవలం వంద దుప్పట్ల పంపిణీతోనే పనికానిచ్చేద్దామనుకున్న కాంగ్రెస్ పెద్దలకు షాక్ తగిలింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనగానే వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు... ఉన్నదేమో వంద దుప్పట్లు. దీంతో, తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలపై జనాలు మండిపడ్డారు. దీంతో, కార్యక్రమానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ విప్ ద్రోణంరాజు చాలా ఇబ్బంది పడ్డారు.