: కేంద్ర కేబినెట్ విస్తరణపై రెండు రోజుల్లో స్పష్టత: చంద్రబాబు
కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరగనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విస్తరణపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) సదస్సులో పాల్గొన్న అనంతరం బాబు పైవిధంగా చెప్పారు. సదస్సులో అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ను మిషన్ గా పెట్టుకున్నామని, రాబోయే రోజుల్లో నైపుణ్యం కలిగిన యువతను అందిస్తామని చెప్పారు. అటు వ్యవసాయాన్ని కూడా ఓ మిషన్ గా పెట్టుకున్నామని చెప్పిన సీఎం, వ్యవసాయ అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటిస్తామని వివరించారు.