: ఈనెల 11 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఈ నెల 11 నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా, మయన్మార్, ఫిజీల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా, ప్రధాని ఆయా దేశాలతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు. ఆస్ట్రేలియాలో జరిగే జీ-20 సదస్సులో పాల్గొని... భారత్ లోని అవకాశాలను ప్రపంచానికి వివరిస్తామని ప్రధాని తెలిపారు.