: ఇరోం షర్మిల దీక్షకు 14 ఏళ్లు
మణిపూర్ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిల నిరాహారదీక్షకు నిన్నటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరం నవంబర్ 2న అస్సాం రైఫిల్స్ సిబ్బంది చేతిలో 10 మంది పౌరులు హతులు కావడంతో ఆగ్రహించిన షర్మిల... ఏఎఫ్ఎన్పీఏ-1958 చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిరాహారదీక్షకు దిగింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు.