: 'పెంటగాన్' నివేదికను ఖండించిన పాకిస్థాన్
సరిహద్దు వద్ద భారత, ఆఫ్ఘనిస్తాన్ సైనికులను ఎదుర్కొనేందుకు, తీవ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పుతోందంటూ ఇటీవల అమెరికా రక్షణ వ్యవహారాల శాఖ 'పెంటగాన్' తన నివేదికలో పేర్కొంది. ఆ ఆరోపణలను పాక్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు యూఎస్ రాయబారికి పాక్ సమన్లు పంపినట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.