: ఎలుకల ఏరివేతకు ఆ ఆస్పత్రి రూ.55 లక్షలు ఖర్చు చేసింది!


సర్కారీ ఆస్పత్రులను నిత్యం నిధుల కొరత వేధిస్తూ ఉంటుంది. మందులుంటే, సౌకర్యాలుండవు... కొన్ని చోట్ల ఆ మందులూ ఉండవు! అయితే, మధ్యప్రదేశ్ లోనే అతిపెద్ద సర్కారీ దవాఖానాగా పేరుగాంచిన మహారాజా యశ్వంత్ రావ్ ఆస్పత్రిలో మాత్రం ఎలుకలకు కొదవేలేదట. రోజూ ఓపీకే వెయ్యిమంది వచ్చి వెళ్లే ఆ ఆస్పత్రిలో 10 వేల పైచిలుకు ఎలుక కన్నాలున్నాయట. మరి ఎలుకలకు ఆవాసంగా మారిన ఆస్పత్రిని బాగు చేయాలంటే ఏం చేయాలి? కన్నాలను పూడ్చాలి, ఎలుకలను పట్టేందుకు బోన్లు పెట్టాలి. ఇందుకోసం నిధులు ఖర్చు చేయాలి. ఇదే సూత్రాన్ని పాటించారు ఆస్పత్రి సిబ్బంది. రెండు రోజులుగా కొనసాగిన ఈ ఎలుకల వేటకు ఆస్పత్రి వెచ్చించిన మొత్తమెంతో తెలుసా... అక్షరాలా రూ.55 లక్షలు! అంత ఖర్చు పెట్టి, రెండు రోజుల్లో పట్టిన ఎలుకలెన్నో తెలుసా? కేవలం 2,500 మాత్రమేనట! ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన పాపానికి ఇంత భారీ మొత్తాన్ని వృధాగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News