: మీడియానే మమ్మల్ని దొంగలను చేసింది: మమతా బెనర్జీ


శారదా చిట్ ఫండ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీకల దాకా కూరుకుపోయిన నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాపై చిందులు తొక్కారు. దేశంలోని అతి పేద పార్టీల్లో తమ పార్టీ ఒకటని గురువారం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా మమతా బెనర్జీ పేర్కొన్నారు. శారదా చిట్ ఫండ్ నుంచి కాదు కదా, ఏ ఒక్క చిట్ ఫండ్ కంపెనీ నుంచి తమ పార్టీ నేతలు చిల్లిగవ్వ కూడా ముట్టలేదని స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యవహారంలో మీడియా తమను దొంగలుగా చిత్రీకరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శారదా చిట్ ఫండ్ సంస్థ నుంచి లంచాలను తమ పార్టీ నేతలు స్వీకరించినట్లుగా ఆధారాలేమైనా ఉంటే చెప్పండని మీడియాను ప్రశ్నించారు. ‘మీ మీద మాకేమీ పగ లేదు. అలాగని మాపై అపనిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దయచేసి అబద్ధాలు ప్రచారం చేయొద్దు’ అని ఆమె మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News