: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్: పొన్నాల విసుర్లు


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునే విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గురువారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగట్టారు. కేంద్రం నుంచి నిధులు సాధించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించని కారణంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.7 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయన్నారు. అంతా అయిపోయిన తర్వాత నిధులు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తే ఎలాగని వ్యాఖ్యానించిన పొన్నాల, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కేసీఆర్ వ్యవహారం తయారైందన్నారు.

  • Loading...

More Telugu News