: ఇంటికో ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకుంటాం: యనమల
ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం ఇచ్చి, ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులకు అనుమతినిచ్చామని, మొత్తం మీద 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని యనమల తెలిపారు.