: రాష్ట్రానికి ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటు చేయాలి: ఎంపీ హరిబాబు
ఈ ఏడాది ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఉమ్మడి ఇంటర్ బోర్డు వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాజధానికి భూసేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.