: నల్లధనం ఖాతాదారు రాధా టింబ్లోకు ఈడీ సమన్లు
స్విస్ బ్యాంకులో నల్లధనం దాచేసిన గోవా మైనింగ్ మహారాణి రాధా టింబ్లోకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)గురువారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న తమ ముందు హాజరు కావాలని ఆమెకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. నల్లధనం వ్యవహారానికి సంబంధించిన విచారణలో భాగంగానే హాజరు కావాలని ఆ సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే, ప్రభుత్వం భావిస్తున్నట్లు తానేమీ అక్రమ సంపాదనను ఆర్జించలేదని, తన లావాదేవీలన్నీ పారదర్శకమేనని ప్రకటించిన రాధా టింబ్లో ఈడీ ముందు ఏం సమాధానం చెబుతారోనన్న అంశంపై ఆసక్తి నెలకొంది.