: చీపురు పట్టి శుభ్రం చేసిన హీరో రామ్


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు భాగమవుతున్నారు. తాజాగా, టాలీవుడ్ హీరో రామ్ చీపురు పట్టాడు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశాడీ యువ హీరో. ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో బాగుందన్నాడు. యువత, తన అభిమానులు ఇందులో పాల్గొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ హీరోయిన్లు హన్సిక, తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లను రామ్ నామినేట్ చేశాడు.

  • Loading...

More Telugu News