: అప్పారావును మేమే అరెస్టు చేశాం: ఎస్పీ ప్రవీణ్


ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ అప్పారావును తామే అరెస్టు చేశామంటూ విశాఖ జిల్లా ఎస్పీ ప్రవీణ్ ప్రకటించారు. ఆయనను ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న సమాచారంతోనే ప్రొఫెసర్ ను అరెస్టు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు. పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. ఎస్పీ ప్రకటనతో ఏయూ విద్యార్థులు మండిపడ్డారు. అరెస్టు చేసిన ప్రొఫెసర్ అప్పారావును వెంటనే చూపించాలంటూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News