: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతోంది బీజేపీలోనే!: హరిబాబు
ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రతి మూడేళ్లకోమారు జరిగే బీజేపీ సంస్థాగత ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఆయన చెప్పారు. గురువారం గుంటూరులో పార్టీ రాష్ట్ర పదాధికారుల భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం హరిబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం వివరాలు తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. పార్టీ సభ్యత్వాన్ని మూడింతలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.