: కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లో ఇందిర విగ్రహానికి అవమానం


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గం గజ్వేల్ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహం మెడలో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. గురువారం ఉదయం దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందిర విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News