: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఇండియా ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన సీఐఐ ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. రెండు రోజుల క్రితం బెంగళూరులో పర్యటించిన చంద్రబాబు, పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా భారత కార్పొరేట్ దిగ్గజాలతోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.