: ఆ ఆరోపణలు రుజువు చేస్తే ఉరేసుకుంటా: బీజేపీ నేత
పశ్చిమ బెంగాల్ లో సీపీఎం పార్టీతో కలసి తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతోందన్న ఆరోపణలను రుజువు చేస్తే తాను ఉరేసుకుంటానని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా సవాలు విసిరారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేని తృణమూల్ కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. సీపీఎం పార్టీతో కలసి బీజేపీ... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతోందని సీఎం మమతా దీదీ ఆరోపించారు.