: బుష్ ల వారసుడు రాజకీయాల్లోకి వచ్చేశాడు


అమెరికా చరిత్రలో తమ కుటుంబం పేరును చిరస్థాయిగా లిఖించుకున్న జార్జ్ బుష్ సీనియర్, జార్జి బుష్ జూనియర్ ల వారసుడు వచ్చేశాడు. టెక్సాస్ ల్యాండ్ కమిషనర్ గా జార్జీ ప్రెస్కాట్ బుష్ ఎన్నికయ్యారు. 38 ఏళ్ల బుష్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జాన్ కుక్ పై విజయం సాధించారు. ఆయన తండ్రి జెబ్ బుష్ గతంలో ఫ్లోరిడా గవర్నర్ గా పని చేశారు. బుష్ వంశంలో తొలి ప్రయత్నంలోనే ఎన్నికయిన తొలి వ్యక్తి ప్రెస్కాట్ బుష్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News