: నాది తొలి ప్రేమ: సచిన్ భార్య అంజలి


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భార్య అంజలి తొలిసారి తమ ప్రేమపై నోరు విప్పారు. ముంబైలో జరిగిన 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో సచిన్ ను 17 ఏళ్ల వయసులో తొలిసారి చూసిన తాను, కుర్రాడు బాగున్నాడని తన స్నేహితురాలికి చెప్పినట్టు వెల్లడించారు. లక్షణంగా ఉన్నాడు కదా! అని వెంటనే వెళ్లి సచిన్ ను కలిసినట్టు ఆమె తెలిపారు. తాము ప్రేమలో ఉండగా సచిన్ కు తాను లేఖలు రాసేదాన్నని అంజలి వివరించారు.

  • Loading...

More Telugu News