: తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానం బడ్జెట్ సమావేశాల్లోనే: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాదులో కొత్త పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానం దేశానికే ప్రామాణికంగా ఉండాలని అన్నారు. ఉత్తమ పారిశ్రామిక విధానాలే ప్రభుత్వ విజయానికి సోపానాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణం, భౌగోళిక పరిస్థితులే ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News