: ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ అర్హుల జాబితా రేపే విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు రుణమాఫీ అర్హుల జాబితా రేపు వెబ్ సైట్ లో పెట్టనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 80 లక్షల మంది రైతులు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, అందులో అర్హులైన వారు 49 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. సుమారు 5 లక్షల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్టు తేలింది. ఆధార్, రేషన్ కార్డులు లేని వారు సుమారు 15 లక్షల మంది రైతులు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఆధార్ కార్డు లేకుండా, కేవలం రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉన్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆధార్, రేషన్ కార్డు లేని వారిపై వీఆర్వోలు పరిశీలిస్తున్నారని వారు స్పష్టం చేస్తున్నారు.