: ద్రావిడ్ ఈ సీజన్ లోనూ సలహాదారుగా వ్యవహరిస్తాడు: రాయల్స్ యాజమాన్యం


భారత క్రికెట్ జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ 2015 ఐపీఎల్ సీజన్ లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. గతంలో రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ద్రావిడ్ 2014 సీజన్ లో సలహాదారుగా నియమితుడయ్యాడు. తాజాగా, ద్రావిడ్ ను వచ్చే సీజన్ లోనూ కొనసాగించేందుకు రాయల్స్ యాజమాన్యం నిర్ణయించింది. తన నియామకం పట్ల ద్రావిడ్ సమ్మతి తెలిపాడు. దీంతో, మరోసారి తాజా సీజన్ లో సేవలందించేందుకు అంగీకరించిన ద్రవిడ్ కు సీఈవో రఘు అయ్యర్ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News