: మ్యూజిక్ బాట పట్టిన ప్రముఖ నటుడు మోహన్ లాల్


భవిష్యత్ లో మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ సంగీత విభావరిలో పాల్గొనడాన్ని చూడొచ్చు... ఆయన సంగీతాన్ని ఎంచక్కా వినొచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఆయనిప్పుడు సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. 'లాలి సోమ్' పేరిట ఆయన మ్యూజిక్ బ్యాండ్ ప్రారంభించారు. తన బ్యాండ్ తొలి ప్రదర్శన అంశంగా తన 36 ఏళ్ల సినీ జీవిత ప్రస్థానాన్నే ఎంచుకున్నారు. రెండు గంటలకు పైగా సాగే ఈ సంగీత రూపకంలో పలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను వినియోగించనున్నారని సమాచారం. కాగా, లాలి సోమ్ తొలి ప్రదర్శన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

  • Loading...

More Telugu News