: కేంద్ర కేబినెట్ లోకి గోవా సీఎం పారికర్!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్ కు సంబంధించి అతి ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను కేంద్ర రక్షణశాఖ మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం. తన క్యాబినెట్ లో పారికర్ ను తీసుకోవాలని మోదీ అనుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు ఓ ఆంగ్ల ఛానల్ కు తెలిపాయి. మరోవైపు, ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం కూడా పారికర్ ను కేంద్రంలో ఓ పదవిలోకి తీసుకోవాలని కోరుతోందట. ఈ క్రమంలో సాయంత్రం మోదీ, పారికర్ సమావేశమై తుదిపై నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ శాఖను కొన్ని నెలలుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకు ముందే ఆయన రక్షణ శాఖ నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News